యాత్ర రివ్యూ

Starring : మమ్ముట్టి , జగపతిబాబు , సుహాసిని , రావు రమేష్

Director : మహి వి రాఘవ

Producers : విజయ్ చిల్లా , శశి

Music Director : కృష్ణకుమార్

Release Date : 8 ఫిబ్రవరి 2019

Espicy Rating:

బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో మిగతా బయోపిక్ లకు భిన్నమైన బయోపిక్ తెరకెక్కింది అదే '' యాత్ర '' . కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించాడు . ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? చూద్దాం . 

కథ : 

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ( మమ్ముట్టి ) ప్రజా సమస్యల పరిష్కారం కోసం 68 రోజుల పాటు పాదయాత్ర చేస్తాడు . చేవెళ్ల చెల్లమ్మ ( సుహాసిని ) నియోజకవర్గం నుండి మొదలుపెట్టిన పాదయాత్ర లో ప్రజల కష్టాలు చూసి చలించిపోతాడు . అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి పనులకు శ్రీకారం చుట్టాడు ? చివరకు ప్రజా సమస్యల కోసం రచ్చబండ వెళ్తూ ఎలా తనువు చాలించాడు . తిరుగులేని నాయకుడిగా ఎలా ఎదిగాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : 

మమ్ముట్టి 

జగపతిబాబు 

సుహాసిని 

దర్శకత్వం 

నేపథ్య సంగీతం  

 డ్రా బ్యాక్స్ :  కొన్ని సాగతీత సన్నివేశాలు 

నటీనటుల ప్రతిభ : 

రాజశేఖర్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి . అచ్చం రాజశేఖర్ రెడ్డి ని తలపించి వై ఎస్ అభిమానులను విశేషంగా అలరించాడు . వన్ మ్యాన్ షో గా మారింది యాత్ర . ఇక వై ఎస్ విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి , చేవెళ్ల చెల్లెమ్మ పాత్రలో సుహాసిని , రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు లు అద్భుతంగా రాణించారు . అలాగే అనసూయ , రావు రమేష్ లతో పాటుగా పోసాని తదితరులు తమతమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసారు . 

సాంకేతిక వర్గం : 

సత్యన్ సూర్యన్ అందించిన విజువల్స్ బాగున్నాయి , కృష్ణకుమార్ పాటలతో పాటుగా నేపథ్య సంగీతంతో కూడా అలరించాడు . ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించి తమ నిర్మాణ దక్షత చాటుకున్నారు నిర్మాతలు . ఇక దర్శకుడు మహి వి రాఘవ విషయానికి వస్తే బయోపిక్ ని అద్భుతంగా చిత్రీకరించి చెరగని ముద్ర వేసాడు . సెకండాఫ్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు ఉన్నప్పటికీ మొత్తానికి రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కు పూర్తి న్యాయం చేసాడు మహి వి రాఘవ . 

ఓవరాల్ గా : 

యాత్ర మెప్పించే  సినిమా