వినయ విధేయ రామ రివ్యూ

Starring : రాంచరణ్ , కియారా అద్వానీ , ప్రశాంత్

Director : బోయపాటి శ్రీను

Producers : డివివి దానయ్య

Music Director : దేవిశ్రీ ప్రసాద్

Release Date : 11 జనవరి 2019

Espicy Rating:

 రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాంచరణ్ నటించిన  చిత్రం వినయ విధేయ రామ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది చూద్దామా  . 

స్టోరీ  : 

నలుగురు అన్నల ముద్దుల తమ్ముడు రామ ( రాంచరణ్ ) , తన అన్నలకు , వదినలకు ఏదైనా ఆపద వస్తోందంటే దానికంటే ముందే నిలిచే వ్యక్తి రామ . ఎన్నికల కమీషనర్ అయిన పెద్దన్ని బీహార్ లో నేర సామ్రాజ్యానికి రారాజు అయిన భయ్యా ( వివేక్ ఒబెరాయ్ ) కిడ్నాప్ చేస్తాడు . దాంతో తన అన్నయ్య ని కాపాడుకోవడానికి రామ ఎలాంటి యుద్ధం చేసాడు ? భయ్యా ని ఎలా మట్టి కరిపించాడు , అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : 

రాంచరణ్ 

యాక్షన్ ఎపిసోడ్స్ 

డ్రా బ్యాక్స్ : 

కథ , కథనం 

డైరెక్షన్ 

సంగీతం 

పెర్ఫార్మెన్స్  : 

 రాంచరణ్ అద్భుతంగా నటించాడు . రాంబో గెటప్ లో రాంచరణ్ సూపర్ అనే చెప్పాలి . యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు చరణ్ .   మెగా అభిమానులకు చరణ్ డ్యాన్స్ , ఫైట్స్  కిక్ ఇచ్చేలా ఉన్నాయి  . ఇక కియారా అద్వానీ కి నటించడానికి స్కోప్ లేకుండాపోయింది .   గఅయితే ఉన్నంతవరకు గ్లామర్ తో అలరించింది . ప్రశాంత్ , స్నేహ , ఆర్యన్ రాజేష్ , మధుసూదన్ తదితరులు తమ తమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు . విలన్ గా వివేక్ ఒబెరాయ్ విలనిజాన్ని పండించాడు  . 

టెక్నీకల్ టీమ్  : 

దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా లేదు . నేపథ్య సంగీతం ఫరవాలేదు . విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి . దర్శకుడు బోయపాటి శ్రీను విషయానికి వస్తే ....... కథ , కథనం లో పూర్తిగా విఫలమయ్యాడు . ఆకట్టుకునే అంశాలు ఏంటంటే ఒక్క చరణ్ ని మాత్రం రాంబో గా చూపించాడు అంతకుమించి దర్శకుడిగా సత్తా చాటే ఒక్క సీన్ కూడా పండించలేక పోయాడు . ఇక కొన్ని సన్నివేశాలను అయితే మరీ దారుణంగా చిత్రీకరించాడు , హింస మరీ ఎక్కువయ్యింది .