రుణం రివ్యూ

Starring : గోపికృష్ణ , మహేంద్ర , శిల్ప , ప్రియా అగస్త్య

Director : ఎస్ . గుండ్రెడ్డి

Producers : భీమనేని సురేష్ - రామకృష్ణారావు

Music Director : ఎస్వీ మల్లిక్ తేజ

Release Date : 12 ఏప్రిల్ 2019

Espicy Rating:

గోపికృష్ణ , మహేంద్ర , శిల్ప , ప్రియా అగస్త్య ల కాంబినేషన్ లో గుండ్రెడ్డి దర్శకత్వంలో భీమనేని సురేష్ - రామకృష్ణారావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం '' రుణం '' . ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా ! 

స్టోరీ : 

ఇద్దరు స్నేహితులైన  సుధీర్ , శ్రీను లు మంచి భవిష్యత్తు కోరుకుంటూ హైదరాబాద్ చేరుకుంటారు . సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లుగా పనిచేస్తూ వస్తున్న జీతాలు సరిపోకపోవడంతో బాగా డబ్బున్న వాళ్ళ ఎకౌంట్ లోంచి పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తారు . విక్టర్ అకౌంట్ నుండి వంద కోట్లు కొట్టెయ్యబోయి అడ్డంగా దొరికిపోతారు . దాంతో విక్టర్ మనుషుల చేతిలో శ్రీను చనిపోతాడు . తన మిత్రుడు చనిపోవడంతో విక్టర్ మనుషుల నుండి తప్పించుకొని శ్రీను తల్లిదండ్రుల కోసం వాళ్ళ ఊరు వెళ్తాడు . అక్కడ వాళ్ళని చూసి షాక్ అవుతాడు సుధీర్ . శ్రీను తల్లిదండ్రులను చూసిన సుధీర్ ఎందుకు షాక్ అయ్యాడు ? ఆ తర్వాత ఏం చేసాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : 

పాటలు 

ఎంచుకున్న కథ 

పెర్ఫార్మెన్స్ : 

సుధీర్ , శ్రీను పాత్రల్లో గోపికృష్ణ , మహేంద్ర లు బాగా నటించారు . ఇక గోపికృష్ణ యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాగా నటించాడు . అందమైన భామలు ముగ్గురు కూడా బాగా నటించారు . ప్రియా అగస్త్య అలాగే శిల్పా తమ పాత్రలకు న్యాయం చేసారు . అలాగే గ్లామర్ తో కూడా అలరించారు . 

టెక్నికల్ టీమ్ : 

దర్శకుడు మంచి కథ ని ఎంచుకున్నాడు , అయితే స్క్రీన్ ప్లే పరంగా ఇంకా కొంత బెటర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది . స్కై విన్ మొబైల్ యాడ్ ని భలేగా కథలో చొప్పించారు . ఇక భీమనేని సురేష్ - రామకృష్ణారావు నిర్మాణ విలువలు బాగున్నాయి . మల్లిక్ తేజ్ అందించిన పాటలు బాగున్నాయి.

ఓవరాల్ గా : 

అత్యాశకు పోవద్దని యువతకు సందేశం ఇచ్చే రుణం