రజనీకాంత్ 2. ఓ రివ్యూ

Starring : రజనీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్

Director : శంకర్

Producers : సుభాస్కరన్

Music Director : ఏ ఆర్ రెహ్మాన్

Release Date : 29 నవంబర్ 2018

Espicy Rating:

2010 లో వచ్చిన రోబో చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . కాగా ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం 2. ఓ . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది చూద్దాం . 

స్టోరీ : 

మనుషులు సెల్ ఫోన్ లో మాట్లాడుతుండగానే మాయం అవుతూ ఉంటాయి . వాటిని ఎవరు మాయం చేస్తున్నారు , ఎక్కడికి పోతున్నాయో తెలీక జనాలు అయోమయానికి లౌనౌతారు . అదే సమయంలో ఈ సెల్ ఫోన్ ల మాయాజాలం గురించి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం . ఆ సమావేశానికి డాక్టర్ వశీకరణ్ (రజనీకాంత్ ) కూడా హాజరై చిట్టి ని తిరిగి బ్రతికించడం మాత్రమే ప్రత్యామ్నాయం అని చెబుతాడు అయితే దానికి హోమ్ మినిష్టర్ ఒప్పుకోడు . మళ్ళీ సెల్ ఫోన్ లు మాయం అవడమే కాకుండా సెల్ ఫోన్ వ్యాపారి తో పాటుగా మంత్రి ని కూడా చంపేస్తారు దాంతో చిట్టి ని బ్రతికిస్తాడు డాక్టర్ వశీకరణ్ . సెల్ ఫోన్ లు మాయం చేసేది పక్షిరాజా అని తెలుసుకుంటాడు చిట్టి . అయితే పక్షి రాజా ని నియంత్రించడానికి డాక్టర్ ఎలాంటి చర్యలు తీసుకున్నాడు ? అసలు పక్షి రాజా ఎవరు ? ఎందుకు సెల్ ఫోన్ లను మాయం చేస్తున్నాడు ? చిట్టి పక్షి రాజా ని ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ . 

హైలెట్స్ : 

రజనీకాంత్ 

అక్షయ్ కుమార్ 

శంకర్ దర్శకత్వ ప్రతిభ 

రెహ్మాన్ నేపథ్య సంగీతం 

నిర్మాణ విలువలు 

పెర్ఫార్మెన్స్ : 

చిట్టి గా , డాక్టర్ వశీకరణ్ గా రజనీకాంత్ నటన అమోఘం , అద్వితీయం . చిట్టి పాత్రలో రజనీ మేనరిజం కు ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం . 67 ఏళ్ల వయసులో కూడా కష్టపడి నటించిన తీరుకి హ్యాట్సా ఫ్ చెప్పడం ఖాయం . ఇక అక్షయ్ కుమార్ కు కూడా అద్భుతమైన పాత్ర దొరికింది దాన్ని మరింత అద్భుతంగా చేసాడు అక్షయ్ . మేకప్ కి ఎక్కువ సమయం పట్టేలా ఉన్నప్పటికీ ధైర్యం చేసి గొప్ప సాహసమే చేసాడు అక్షయ్ . అమీ జాక్సన్ గ్లామర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ . 

టెక్నీకల్ టీమ్ : 

రెహమాన్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . సినిమాలో పాటలు అంతగా లేకున్నా వాటిని మర్చిపోయేలా చేసి నేపథ్య సంగీతం తో అలరించాడు . నీరవ్ షా అందించిన విజువల్స్ అద్భుతమనే చెప్పాలి  . శంకర్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే ! అద్భుతమైన విజన్ తో గొప్ప త్రీడి పిక్చర్ ని చూసిన అనుభూతిని కల్పించాడు . సామాజిక సందేశంతో 2. ఓ చిత్రాన్ని రూపొందించి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ని అందించాడు . ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ దక్షత ని తప్పకుండా అభినందించాల్సి ఉంది . 

ఫైనల్ గా :  2. ఓ టెక్నీకల్ వండర్