పడిపడి లేచె మనసు రివ్యూ

Starring : శర్వానంద్ , సాయి పల్లవి

Director : హను రాఘవపూడి

Producers : ప్రసాద్ - సుధాకర్

Music Director : విశాల్ చంద్రశేఖర్

Release Date : 21 డిసెంబర్ 2018

Espicy Rating:

శర్వానంద్ - సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '' పడిపడి లేచె మనసు '' . ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి  ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందా ? లేదా ? అన్నది చూద్దామా . 

స్టోరీ : వైశాలి ( సాయి పల్లవి ) అంటే పిచ్చి ప్రేమ సూర్య కు ( శర్వానంద్ ) . ఆమె వెంట పడి మరీ పిచ్చిగా ప్రేమిస్తాడు . వైశాలి కూడా సూర్య ని అంతే ఘాడంగా ప్రేమిస్తుంది . అయితే అనుకోని కారణాల వల్ల సూర్య ప్రేమని నిరాకరించి అతడికి దూరం అవుతుంది . వైశాలి ప్రేమ దక్కినట్లే దక్కి దూరం కావడంతో సూర్య పిచ్చి వాడౌతాడు . సూర్య ని ప్రేమించిన వైశాలి ఎందుకు సూర్య కు బ్రేకప్ చెప్పింది . సూర్య -వైశాలి మళ్ళీ ఒక్కటయ్యారా ? లేక సూర్య పిచ్చి వాడయ్యాడా ?  చివరకు ఏమైంది ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : శర్వానంద్,సాయి పల్లవి ,హను డైరెక్షన్ ,పాటలు ,విజువల్స్ 

డ్రా బ్యాక్స్ : స్లో నేరేషన్ 

పెర్ఫార్మెన్స్ : శర్వానంద్ అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు , భగ్న ప్రేమికుడిగా , ప్రేమికుడిగా తన పాత్రలో ఉన్న వేరియేషన్స్ ని అద్భుతంగా పలికించాడు శర్వా . సాయి పల్లవి ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . సాయి పల్లవి పాత్ర గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే ! అంత బాగా చేసింది . ఇక శర్వానంద్ - సాయి పల్లవి ల జంట చూడముచ్చటగా ఉంది అంతేకాదు ఇద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది . 

టెక్నీషియన్స్ : విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . విశాల్ అందించిన అన్ని పాటలు కూడా దేనికదే ప్రాధాన్యతని సంతరించుకున్నాయి . జేకే అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకు మరో హైలెట్ అనే చెప్పాలి . కోల్ కతా అందాలను మరింత అందంగా బంధించి ప్రేక్షకులకు కనువిందు గా అందించాడు . నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఖర్చు పెట్టి మంచి విజువల్ ట్రీట్ అందించారు . ఇక దర్శకుడు హను ఈ సినిమాని అందమైన ప్రేమ కావ్యంగా చిత్రీకరించి సక్సెస్ కొట్టాడు . శర్వానంద్ నమ్మి అప్పగించిన పనిని దిగ్విజయంగా పూర్తిచేసాడు హను . 

ఫైనల్ గా : యువతని ఆకట్టుకునే పడిపడి లేచె మనసు