ఎన్టీఆర్ మహానాయకుడు రివ్యూ

Starring : నందమూరి బాలకృష్ణ , విద్యాబాలన్ , కళ్యాణ్ రామ్ , రానా

Director : క్రిష్

Producers : వసుంధరాదేవి - బాలకృష్ణ

Music Director : కీరవాణి

Release Date : 22 ఫిబ్రవరి 2019

Espicy Rating:

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు ప్లాప్ కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని రిలీజ్ చేసారు . ఈరోజు విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే స్టోరీ  లోకి వెళ్లాల్సిందే . 

స్టోరీ  : సినిమారంగంలో రారాజుగా వెలుగొందిన ఎన్టీరామారావు ( నందమూరి బాలకృష్ణ ) సినిమా రంగాన్ని వదులుకొని రాజకీయరంగంలోకి అడుగుపెడతాడు . తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నికల సమరంలో దిగుతాడు . దశాబ్దాలుగా వేళ్లూనుకొనిపోయిన కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడు ఎన్టీఆర్ . అయితే కొద్దీ రోజుల్లోనే పార్టీలో అసంతృప్తి చెలరేగి నాదెండ్ల భాస్కర్ రావు ( సచిన్ ఖేడ్ కర్ ) నాయకత్వంలో ఎన్టీఆర్ ని అధికారం నుండి దించేస్తారు . ఆ తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎన్టీఆర్ సాగించిన పోరాటం ఏంటి ? మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నికయ్యాడు అన్నదే ఎన్టీఆర్ మహానాయకుడు కథ . 

హైలెట్స్ : నందమూరి బాలకృష్ణ ,విద్యాబాలన్ ,రానా 

డ్రా బ్యాక్స్ : స్క్రీన్ ప్లే ,సాగతీత సన్నివేశాలు 

పెర్ఫార్మెన్స్  : ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ అద్భుత అభినయం చూపించాడు . ఎన్టీఆర్ లోని ఆవేశం , హావభావాలు ప్రదర్శించి కొన్ని సన్నివేశాల్లో అయితే అచ్చం ఎన్టీఆర్ ని తలపించాడు . ఇక విద్యాబాలన్ మరోసారి బసవతారకం పాత్రలో మరోసారి రాణించింది . సెంటిమెంట్ సన్నివేశాల్లో ఇద్దరి అభినయం అద్భుతమనే చెప్పాలి . రానా చంద్రబాబు నాయుడిగా మెప్పించాడు . కళ్యాణ్ రామ్ హరికృష్ణ గా జీవించాడు . నాదెండ్ల పాత్రలో సచిన్ ఖేడ్ కర్ అభినయం బాగుంది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు . 

టెక్ని కల్ టీమ్  : జ్ఞానశేఖర్ విజువల్స్ చాలా బాగున్నాయి . ఎన్ బి కె నిర్మాణ విలువలు అద్భుతం , ముఖ్యంగా ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది . పాటలు అలాగే నేపథ్య సంగీతం తో అలరించాడు కీరవాణి . సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ కొన్ని చోట్ల అదిరిపోయాయి . ఇక క్రిష్ విషయానికి వస్తే ...... ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడనే చెప్పాలి . 

ఫైనల్  గా : తప్పకుండా ఓసారి చూడొచ్చు .