ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

Starring : నందమూరి బాలకృష్ణ , విద్యాబాలన్ , కళ్యాణ్ రామ్ , రానా తదితరులు

Director : క్రిష్

Producers : వసుంధరాదేవి , బాలకృష్ణ

Music Director : ఎం ఎం కీరవాణి

Release Date : 9జనవరి 2019

Espicy Rating:

నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ . రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ బయోపిక్ లో మొదటి భాగం  '' ఎన్టీఆర్ కథానాయకుడు '' ఈరోజు విడుదల అయ్యింది . నందమూరి బాలకృష్ణ , విద్యాబాలన్ , సుమంత్ , రానా , కళ్యాణ్ రామ్ తదితరులు నటించిన ఈ చిత్రం  తెలుగు ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? ఓసారి చూద్దామా ! 

స్టోరీ  : 

రామారావు ( నందమూరి బాలకృష్ణ ) కు రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం వస్తుంది అయితే ఆ ఉద్యోగాన్ని వదిలేసి హీరో అవుతానని, సినిమాల్లో నటించడానికి  మద్రాస్ వెళ్తాడు .అవకాశాల కోసం రామారావు ఎలా కష్టపడ్డాడు , ఎలా నిలదొక్కు కున్నాడు ? ఎలా హీరోగా సక్సెస్ అయ్యాడు . ప్రేక్షకుల చేత దేవుడిగా ఎలా కీర్తింప బడ్డాడు .  తనని స్టార్ ని  చేసిన తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని ఎలాంటి పరిస్థితుల్లో స్థాపించాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : 

నందమూరి బాలకృష్ణ 

విద్యాబాలన్ 

సుమంత్ 

సంగీతం 

మాటలు 

డ్రా బ్యాక్స్ : 

ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ 

పెర్ఫార్మెన్స్  : 

నందమూరి తారకరామారావు పోషించిన పాత్రలలో కొన్నింటిని బాలయ్య కూడా పోషించి మంచి మార్కులు కొట్టేసాడు . బాలయ్య అభినయం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . అలాగే విద్యాబాలన్ పాత్ర కూడా హైలెట్ అనే చెప్పాలి . బసవతారకం పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసింది విద్యాబాలన్ . బాలయ్య - విద్యాబాలన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి . అక్కినేని పాత్రలో సుమంత్ సరిగ్గా సరిపోయాడు . అక్కినేని ని గుర్తు చేసాడు సుమంత్ . హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ , చంద్రబాబు పాత్రలో రానా , త్రివిక్రమరావు పాత్రలో దగ్గుబాటి రాజా , సావిత్రిగా నిత్యామీనన్ ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడంత లిస్ట్ ఉంది . అందరు కూడా ఆయా పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించారు . 

టెక్నీకల్ టీమ్  : 

ఎం ఎం కీరవాణి అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . పాటలతో పాటుగా రీ రికార్డింగ్ తో ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాడు కీరవాణి . జ్ఙానశేఖర్ ఛాయాగ్రహణం కూడా మరో హైలెట్ గా నిలిచింది . అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకున్నాడు . 

బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ బాగున్నాయి . రాజీపడకుండా నిర్మించారు , ఇక దర్శకుడు క్రిష్ విషయానికి వస్తే ...... ఎన్టీఆర్ బయోపిక్ ని అందంగా తీర్చి దిద్దడంలో క్రిష్ సఫలీ కృతుడయ్యాడు . 

ఫైనల్ గా  : 

ఎన్టీఆర్ కథానాయకుడు ని తప్పకుండా చూడొచ్చు