మిస్టర్ మజ్ను రివ్యూ

Starring : అఖిల్ , నిధి అగర్వాల్

Director : వెంకీ అట్లూరి

Producers : భోగవల్లి ప్రసాద్

Music Director : తమన్

Release Date : 25 జనవరి 2019

Espicy Rating:

అక్కినేని అఖిల్ - నిధి అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ మజ్ను . హిట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అఖిల్ కు సోలో హీరోగా ఇది మూడో చిత్రం . మరి ఈ చిత్రంతో అఖిల్ హిట్ కొట్టాడా ? లేదా ? అన్నది చూద్దామా !

స్టోరీ  : 

విక్కీ ( అఖిల్ ) ప్లే బోయ్ , అమ్మాయిలతో సరదాగా గడిపే విక్కీ లండన్ లో ఎంజాయ్ చేస్తుంటాడు . అయితే విక్కీ ని చూసి అతడి మనస్తత్వం మంచిదని గ్రహించిన నిక్కీ ( నిధి అగర్వాల్ ) ని ప్రేమిస్తుంది . అయితే నిక్కీ ప్రేమని చులకన చేయడంతో విక్కీ కి దూరం అవుతుంది . నిక్కీ దూరం అయ్యాకే విక్కీ కి నిక్కీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది దాంతో ఆమె కోసం మిస్టర్ మజ్ను ఏం చేసాడు ? తన ప్రేమని సాధించుకుంటాడా ? అన్నది తెరపై చూడాల్సిందే . 

హైలెట్స్ : 

అఖిల్ 

నిధి అగర్వాల్ గ్లామర్ 

కామెడీ 

తమన్ సంగీతం 

విజువల్స్ 

డ్రా బ్యాక్స్  : 

రొటీన్ స్టోరీ  

సెకండాఫ్ 

పెర్ఫార్మెన్స్  : 

లవర్ బాయ్ గా అఖిల్ మెప్పించాడు . డ్యాన్స్ లో అలాగే ఫైట్స్ లలో కూడా మరింతగా రాటుదేలాడు అఖిల్ , అయితే నటనలో ఇంకాస్త రాణించాల్సి ఉంది . నిధి అగర్వాల్ కు మంచి పాత్ర లభించింది . గ్లామర్ తో అలరించడమే కాకుండా యాక్టింగ్ తో కూడా ఆకట్టుకుంది . ప్రియదర్శి , హైపర్ ఆది ల కామెడీ అలరించింది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు . 

టెక్నీకల్ టీమ్  : 

తమన్ అందించిన సంగీతం బాగుంది , పాటలు వినసొంపుగా ఉన్నాయి అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు తమన్ . లండన్ అందాలను మరింత అందంగా చూపించాడు ఛాయాగ్రాహకులు జార్జి సి విలియమ్స్.  నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు వెంకీ అట్లూరి విషయానికి వస్తే ...... తొలిచిత్రం తొలిప్రేమ తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ మిస్టర్ మజ్ను తో మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేక పోయాడు . ఫస్టాఫ్ ని బాగానే తీసినప్పటికి సెకండాఫ్ ని మాత్రం సరిగ్గా రాసుకోలేకపోయాడు . 

ఫైనల్ గా  : 

యువతకు  మాత్రమే నచ్చే సినిమా