మజిలీ రివ్యూ

Starring : నాగచైతన్య , సమంత , దివ్యంకా కౌశిక్

Director : శివ నిర్వాణ

Producers : సాహు గారపాటి , హరీష్ పెద్ది

Music Director : గోపిసుందర్ ,తమన్

Release Date : 5 ఏప్రిల్ 2019

Espicy Rating:

అక్కినేని నాగచైతన్య - సమంత కలిసి జంటగా పెళ్లయ్యాక నటించిన చిత్రం '' మజిలీ ''. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి - హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు . ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ఓసారి చూద్దామా !

స్టోరీ : 

క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే పూర్ణ ( నాగచైతన్య ) మంచి ప్లేయర్ కావడంతో అన్షు ( దివ్యంకా కౌశిక్ ) ప్రేమిస్తుంది . పూర్ణ - అన్షు ల ప్రేమ సఫలం కాదు కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది . దాంతో పూర్ణ డిప్రెషన్ లోకి వెళ్తాడు . కుటుంబ సభ్యుల ఒత్తిడితో శ్రావణి ( సమంత ) ని పెళ్లి చేసుకుంటాడు . ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న పూర్ణ శ్రావణి ని ఎలా చూసుకున్నాడు ? ఈ ఇద్దరి జీవితం ఎలాంటి మలుపులు లోనయ్యింది అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 హైలెట్స్ : 

అక్కినేని నాగచైతన్య 

సమంత 

దివ్యంకా కౌశిక్ 

పాటలు 

నేపథ్య సంగీతం 

విజువల్స్ 

సెంటిమెంట్ 

డ్రా బ్యాక్స్ : 

సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు 

స్లో నెరేషన్ 

పెర్ఫార్మెన్స్ : 

పూర్ణ పాత్రలో రెండు వేరియేషన్స్ అద్భుతంగా ప్రదర్శించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు నాగచైతన్య . నటుడిగా నాగచైతన్య కు ఈ మజిలీ తన కెరీర్ లోనే ఓ మజిలీ గా నిలిచిపోనుంది . టీనేజ్ కుర్రాడిలా అలాగే డిప్రెషన్ తో బాధపడే యువకుడిగా తనదైన విభిన్నత చూపించాడు చైతూ . ఇక సమంత కూడా అద్భుతంగా నటించింది . ఆమె గురించి , నటన గురించి కొత్తగా చెప్పేదేముంది కాకపోతే మధ్య తరగతి గృహిణి గా సమంత నటనకు జేజేలు పలకడం ఖాయం . మరో హీరోయిన్ దివ్యంకా కౌశిక్ కు మంచి పాత్ర లభించింది . తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది దివ్యంకా కౌశిక్ . చైతూ - దివ్యంకా ల రొమాన్స్ కుర్రకారుని ఆకట్టుకోవడం ఖాయం . ఇక మిగిలిన పాత్రల్లో రావు రమేష్ , పోసాని లు బాగా చేసారు . 

టెక్నికల్ టీమ్ : 

గోపీసుందర్ అందించిన పాటలు బాగున్నాయి , తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . విష్ణు శర్మ విజువల్స్ చాలా బాగున్నాయి . విజువల్ గా చాలా బాగుంది మజిలీ . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు శివ నిర్వాణ విషయానికి వస్తే ....... మధ్యతరగతి ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు . అయితే ఫస్టాఫ్ ని బాగా హ్యాండిల్ చేసిన శివ సెకండాఫ్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది మొత్తానికి మజిలీ కొంతమంది కి హార్ట్ టచింగ్ గా ఉండటం ఖాయం . 

ఫైనల్ గా : 

ఓసారి తప్పకుండా చూడొచ్చు