లవర్స్ డే రివ్యూ

Starring : ప్రియా ప్రకాష్ వారియర్ , రోషన్

Director : ఒమర్ లులు

Producers : గురు రాజ్ - వినోద్ రెడ్డి

Music Director : షాన్ రెహమాన్

Release Date : 14 ఫిబ్రవరి 2019

Espicy Rating:

 కన్ను గీటుతూ  సంచలనం సృష్టించిన  ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మలయాళ  చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే గా రిలీజ్ చేసారు . లవర్స్ డే రోజున వచ్చిన ఈ లవర్స్ డే చిత్రం ఆకట్టుకునేలా  రూపొందిందా ? లేదా ? చూద్దామా ? . 

స్టోరీ  : 

రోషన్ ( రోషన్ ) ప్రియా ( ప్రియా ప్రకాష్ వారియర్ ) ని ప్రేమిస్తాడు . ప్రియా కు కూడా రోషన్ అంటే ఇష్టం అయితే ఈ ఇద్దరు అనుకోని తప్పు చేసి విడిపోతారు . మళ్ళీ వాళ్ళని కలపడానికి గాద ( నూరిన్ షరీఫ్ ) ప్రయత్నాలు చేస్తుంది . విభేదాలతో విడిపోయిన రోషన్ - ప్రియా లు ఒక్కటయ్యారా ? లేక రోషన్ - గాద ఒక్కటయ్యారా ? అసలు రోషన్ - ప్రియా ల మధ్య ఈ గాద ఎవరు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : 

ప్రియా ప్రకాష్ వారియర్ -రోషన్ 

నూరిన్ షరీప్ గ్లామర్ 

డ్రా బ్యాక్స్ : 

స్క్రీన్ ప్లే 

ఎడిటింగ్ 

డైరెక్షన్ 

పెర్ఫార్మెన్స్  : 

ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్ తో అలరించింది అలాగే రోషన్ తో ఈ భామ చేసిన రొమాన్స్  వర్కౌట్ అయ్యింది. యువతని అలరించేలా ఉంది ఈ జంట  .  అలాగే తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. రోషన్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు   . నూరిన్ షెరిఫ్ తన  పాత్రని చక్కగా వినియోగించుకుంది . గ్లామర్ తో కూడా అలరించిడమే కాకుండా యాక్టింగ్ తో కూడా మెప్పించింది . 

టెక్ని కల్ టీమ్  : 

యువతని అలరించేలా కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు దాన్ని సరైన దిశలో మాత్రం నడిపించలేకపోయాడు . అక్కడక్కడా తన దర్శకత్వ ప్రతిభ ని చూపించినా ఓవరాల్ గా డైరెక్టర్ గా విఫలమయ్యాడు . శీను సిద్దార్థ్  విజువల్స్ బాగున్నాయి . షాన్ రెహమాన్ అందించిన పాటలలో రెండు పాటలు మాత్రమే బాగున్నాయి .  అయితే నేపథ్య సంగీతంతో అలరించాడు  . నిర్మాణ విలువలు బాగున్నాయి . 

ఫైనల్  గా : 

 లవర్స్ డే కేవలం లవర్స్ కు మాత్రమే