లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

Starring : పి. విజయ్ కుమార్ , యజ్ఞ శెట్టి , శ్రీ తేజ్

Director : రాంగోపాల్ వర్మ

Producers : రాకేష్ రెడ్డి

Music Director : కల్యాణి మాలిక్

Release Date : 29 మార్చి 2019

Espicy Rating:

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు లక్ష్మీపార్వతి ని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలతో రూపొందిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ . రిలీజ్ కి ముందే వివాదాలను రాజేసిన ఈ చిత్రం ఈరోజు అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథ : 

1989 లో అధికారం కోల్పోయి నా అన్నవాళ్ళు పక్కన లేని సమయంలో ఎన్టీఆర్ జీవిత కథ రాస్తానని చెప్పి ఎన్టీఆర్ జీవితంలోకి అడుగుపెడుతుంది లక్ష్మీపార్వతి. అయితే ఎన్టీఆర్ కు అన్ని సపర్యలు చేస్తూ మనసుకి దగ్గర అవుతుంది. దాంతో లక్ష్మీపార్వతి ని రెండో  పెళ్లి చేసుకుంటాడు ఎన్టీఆర్. లక్ష్మీపార్వతి ని పెళ్లి చేసుకోవడం కుటుంబ సభ్యులకు అందునా చంద్రబాబు కి అస్సలు ఇష్టం ఉండదు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు రావడం , ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ సంచలన విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక లక్ష్మీపార్వతి ప్రాధాన్యం ఎక్కువ కావడం , చంద్రబాబు ప్రాధాన్యత తగ్గుముఖం పట్టడంతో వెన్నుపోటు కి రంగం సిద్ధం అవుతుంది. 

నటీనటుల ప్రతిభ: 

నందమూరి తారక రామారావు గా డ్రామా ఆర్టిస్టు విజయ్ కుమార్ బాగా నటించాడు. ఎన్టీఆర్ హావభావాలను విజయ్ కుమార్ ప్రదర్శించి మంచి మెప్పు పొందాడు. ఇక కీలక మైన లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి అద్భుతంగా నటించింది. ఆ పాత్రలో యజ్ఞ శెట్టి ని తప్ప మరొకరిని ఊహించలేం అంటే నమ్మండి అంత బాగా యాక్ట్ చేసింది లక్ష్మీపార్వతి పాత్రలో. ఇక మరో కీలకపాత్ర బాబు ది. ఆ పాత్రలో శ్రీ తేజ్ ప్రాణం పోసాడు. అచ్చం బాబు గారిని తలపించాడు శ్రీ తేజ్. ఇకమిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

సాంకేతిక వర్గం : 

రాంగోపాల్ వర్మ - అగస్త్య మంజు లు సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకులుగా ఈ ఇద్దరికి మంచి మార్కులు పడతాయి. ఎన్టీఆర్ ,లక్ష్మీపార్వతి ల కథ అనగానే ఇంటెన్షన్ నెలకొనడం ఖాయం. ఆయుట దాన్ని అలాగే మెయింటెన్ చేసి సక్సెస్ సాధించారు. పాటలు అంతంత మాత్రమే అయినప్పటికి అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ఓవరాల్ గా : 

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించడం ఖాయం.