కవచం రివ్యూ

Starring : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ , మెహరీన్

Director : శ్రీనివాస్ మామిళ్ళ

Producers : నవీన్

Music Director : తమన్

Release Date : 7 డిసెంబర్ 2018

Espicy Rating:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,  కాజల్ అగర్వాల్ , మెహరీన్ , నీల్ నితిన్ ల కాంబినేషన్  శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో నవీన్ నిర్మించిన చిత్రం '' కవచం ''. కవచం  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా నిలబెట్టేలా రూపొందిందా ?  లేదా అన్నది చూద్దామా !

స్టోరీ  : 
విశాఖపట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా  పనిచేసే విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్  . అయితే  కాఫీ షాప్ లో పనిచేసే సంయుక్త ( కాజల్ అగర్వాల్ ) ని ప్రేమిస్తాడు.కానీ ఆమెకు మరొకరితో పెళ్లి కుదిరిందని తెలిసి షాక్ అవుతాడు . అయితే అదే సమయంలో తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో డబ్బు అవసరం ఏర్పడుతుంది .దాంతో  డబ్బు కోసం కిడ్నాప్ డ్రామా ఆడతాడు విజయ్   అయితే కిడ్నాప్  డ్రామా అనుకుంటే నిజంగానే సంయుక్త కిడ్నాప్ అవుతుంది .దాంతో ఆమెని కాపాడటానికి విజయ్ ఏం చేసాడు ? అసలు ఆమెని ఎవరు కిడ్నాప్ చేసారు అన్నది తెరమీద చూడాల్సిందే . 

హైలెట్స్ : 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 
కాజల్ అగర్వాల్ 
మెహరీన్ గ్లామర్ 
యాక్షన్ సీన్స్ 
డ్రా బ్యాక్స్ : 
 కొన్ని సీన్స్ 
ఎడిటింగ్ 
పాటలు 

పెర్ఫార్మెన్స్  : 
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగానే  నటించాడు . పోలీస్ లుక్ లో అదరగొట్టాడు .  యాక్షన్ హీరో ఇమేజ్ కోసం  చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి . డ్యాన్స్ లో , ఫైట్ల్స్  బాగా చేసి భేష్ అనిపించాడు  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . కాజల్ అగర్వాల్ తో కెమిస్ట్రీ బాగానే కుదిరింది ఈ హీరోకు  . కాజల్ అగర్వాల్ , మెహరీన్ లు ఇద్దరు కూడా గ్లామర్ తో ఆకట్టుకున్నారు  . విలన్ గా నీల్ నితిన్ స్టైలిష్ లుక్ లో మెప్పించాడు, అయితే అతడి పాత్ర నిడివి తక్కువ ఉంది  . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు బాగానే  నటించారు . 

టెక్నికల్ టీమ్  : 
తమన్ అందించిన పాటల్లో ఆకట్టుకునే  అయితే  నేపథ్య సంగీతంతో సినిమాకు కవచం లా నిలబడ్డాడు . కెమెరా పనితనం  కూడా  ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . వైజాగ్ అందాలను మాత్రమే కాకుండా హీరోయిన్ లను మరింత అందంగా చూపించాడు చోటా కే నాయుడు . నిర్మాణ విలువలు బాగున్నాయి ,  తక్కువ బడ్జెట్ లోనే రిచ్ క్వాలిటీ ని చూపించారు . దర్శకుడు శ్రీనివాస్ .......  యాక్షన్ ఎలిమెంట్ ని తీసుకొని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు అనుగుణంగా కథని మలచుకొని  కమర్షియల్ సక్సెస్ కోసం కృషి చేసాడు .  

పంచ్ లైన్  యూత్ ని ఆకట్టుకునే  కవచం