ఎఫ్ 2 రివ్యూ

Starring : వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్

Director : అనిల్ రావిపూడి

Producers : దిల్ రాజు

Music Director : దేవిశ్రీ ప్రసాద్

Release Date : 12 జనవరి 2019

Espicy Rating:

వెంకటేష్ , వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్  '' ఎఫ్ 2 '' . తమన్నా , మెహరీన్ లు హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగింది . మరి ఈ  ఎఫ్ 2 ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ?  చూద్దాం . 

స్టోరీ  : 

రాజకీయ నాయకుడి దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసే వెంకీ ( వెంకటేష్ ) హారిక ( తమన్నా ) ని పెళ్లి చేసుకుంటాడు . అయితే పెళ్లికి ముందు జీవితం బాగుంటుంది కానీ పెళ్లి తర్వాత బాగుండదు అని ఫీలయ్యే వెంకీ మరదలు హనీ ( మెహరీన్ ) ని ప్రేమిస్తాడు వరుణ్ యాదవ్ ( వరుణ్ తేజ్ ) . పెళ్లి వద్దని చెప్పినప్పటికీ పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడతాడు వరుణ్ దాంతో పెళ్ళాల గోల భరించలేక విదేశాలకు పారిపోతారు వెంకీ , వరుణ్ లు . పెళ్ళాలతో వీళ్లకు  సమస్య ఏంటి ? ఆ సమస్య నుండి బయట పడ్డారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్: 

వెంకటేష్ 

తమన్నా 

మెహరీన్ గ్లామర్ 

ఎంటర్ టైన్ మెంట్ 

డ్రా బ్యాక్స్ : 

కథ , 

సెకండాఫ్ 

పెర్ఫార్మెన్స్  : 

విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటున్న వెంకటేష్ మరోసారి విభిన్న పాత్రని పోషించి మెప్పించాడు వెంకటేష్ . కామెడీ టైమింగ్ తో అలరించాడు వెంకటేష్ . వరుణ్ తేజ్ కు కూడా విభిన్న పాత్ర లభించింది . ఇద్దరు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు . తమన్నా , మెహరీన్ లకు కూడా మంచి పాత్రలు లభించాయి . గయ్యాళి భార్య పాత్రలో తమన్నా , మెహరీన్ లు అందంగా నటించారు , అందాలను కూడా ఆరబోశారు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 

టెక్నీకల్ టీమ్  : 

దర్శకుడు అనిల్ మొదటి భాగాన్ని మంచి ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దాడు , అయితే సెకండాఫ్ ని మాత్రం ఆ స్థాయిలో తీయలేకపోయాడు . అనిల్ బలం ఎంటర్ టైన్ మెంట్ దాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నాడు కానీ రెండో భాగంలో కూడా కొద్దిగా తడబడ్డాడు . దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి . దేవిశ్రీ ప్రసాద్  అందించిన పాటలు ఫరవాలేదు . 

ఫైనల్  గా : 

 ఫ్రస్టేషన్ పోగెట్టి ఫన్ అందించే   ఎఫ్ 2