చిత్రలహరి రివ్యూ

Starring : సాయి ధరమ్ తేజ్ . సునీల్ , కల్యాణీ ప్రియదర్శన్ , నివేదా పేతురాజ్

Director : కిషోర్ తిరుమల

Producers : రవిశంకర్ , నవీన్ , మోహన్

Music Director : దేవిశ్రీ ప్రసాద్

Release Date : 12 ఏప్రిల్ 2019

Espicy Rating:

వరుసగా ఆరు డిజాస్టర్ లతో కెరీర్ అగమ్యగోచరంగా తయారైన పరిస్థితుల్లో సాయి ధరమ్ తేజ్ చేసిన సినిమా చిత్రలహరి . మరి ఈ సినిమాతోనైనా మెగా మేనల్లుడు విజయం సాధిస్తాడా ? లేదా ? చూద్దామా ! 

స్టోరీ  : 

జీవితంలో విజయం అంటే ఎలా ఉంటుందో తెలియని విజయ్ కృష్ణ ( సాయి ధరమ్ తేజ్ ) కెరీర్ లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు . అయితే చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే ఉంటాయి . దాంతో మానసికంగా కుంగిపోతుంటాడు విజయ్ కృష్ణ . అయితే విజయ్ తండ్రి మాత్రం అతడికి అండగా నిలబడతాడు , ధైర్యం చెబుతాడు . రోడ్డు ప్రమాదాల సమయంలో అలర్ట్ చేసే డివైజ్ తయారు చేస్తాడు విజయ్ కృష్ణ . అయితే ఆ క్రమంలో విజయ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ? వాటిని ఎలా అధిగమించాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : 

సాయి ధరమ్ తేజ్ 

పోసాని 

వెన్నెల కిషోర్ 

డ్రా బ్యాక్స్ : 

స్లో నెరేషన్ 

పెర్ఫార్మెన్స్  : 

విజయ్ కృష్ణ పాత్రకు జీవం పోశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . కెరీర్ లో కూడా నిజంగానే వరుస పరాజయాలతో బాధపడుతున్న సాయి ధరమ్ తేజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు . కెరీర్ లో ఎదగాలని తపించిపోయే యువతరం సాయి ధరమ్ తేజ్ పాత్రని ఓన్ చేసుకోవడం ఖాయం . కల్యాణీ ప్రియదర్శన్ అందంగా ఉంది , అలాగే అందంగా నటించింది . నివేదా పేతురాజ్ కార్పొరేట్ మహిళగా రాణించింది . వెన్నెల కిషోర్ ఉంది కొద్దీ సేపు మాత్రమే కానీ ఉన్నంత సేపు నవ్వించాడు . పోసాని పాత్ర బాగుంది . అలాగే సునీల్ కూడా తన పాత్రకు న్యాయం చేసాడు . 

టెక్నికల్ టీమ్  : 

దర్శకుడు కిషోర్ తిరుమల కరెంట్ ఇష్యు ని టచ్ చేసాడు బాగానే ఉంది అయితే స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది . మైత్రి నిర్మాణ విలువలు బాగున్నాయి . దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు . 

ఫైనల్  గా : 

యువతకు  నచ్చడం ఖాయం .