భైరవగీత రివ్యూ

Starring : ధనుంజయ్ , ఇర్రా మోర్

Director : సిద్దార్థ

Producers : రాంగోపాల్ వర్మ

Music Director : రవిశంకర్

Release Date : 14 డిసెంబర్ 2018

Espicy Rating:

 రాంగోపాల్ వర్మ ఓ యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి నిర్మించిన చిత్రం భైరవగీత . ధనుంజయ్ - ఇర్రా మోర్ జంటగా నటించిన ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది . ఫ్యాక్షన్ - రొమాన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ భైరవగీత ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది ఓసారి చూద్దామా ? 

స్టోరీ  : రాయలసీమ లోని తక్కువ కులానికి చెందిన వ్యక్తి  భైరవ (ధనుంజయ్ ).  సుబ్బారెడ్డి దగ్గర పనిచేసే భైరవ సుబ్బారెడ్డి కూతురు  గీత ( ఇర్రా మోర్ ) ని చూసిన మొదటి చూపులోనే ప్రేమిస్తాడు . సిటీ నుండి వచ్చిన గీత తన ఊరిని చూసి రావాలని అనుకుంటుంది . గీత ఊళ్ళో కి వచ్చిందని తెలుసుకున్న ప్రత్యర్ధులు ఆమెని  చంపడానికి  ప్రయత్నిస్తే వాళ్ళ నుండి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ  గీత ని కాపాడతాడు భైరవ  . దాంతో తనని  భైరవ ని ప్రేమిస్తుంది  గీత . ఇంకేముంది భైరవ ని చంపడానికి తన మనుషులను పురమాయిస్తాడు సుబ్బారెడ్డి . అగ్రకులం - నిమ్న కులం ల పోరాటంలో ఎవరు విజయం సాధించారు ? భైరవ - గీత ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : ధనుంజయ్ ,ఇర్రా మోర్ గ్లామర్ ,నేపథ్య సంగీతం 

డ్రా బ్యాక్స్ : స్క్రీన్ ప్లే , కథ 

పెర్ఫార్మెన్స్  :గీత పాత్రలో నటించిన ఇర్రా మోర్ నటనతో ఆకట్టుకుంది , అయితే అంతకుమించి గ్లామర్ తో ఆకట్టుకుంది . ధనుంజయ్ తో ఇర్రా మోర్ చేసిన శృంగార సన్నివేశాలు యువతని గిలిగింతలు పెట్టడం ఖాయం . ధనుంజయ్ - ఇర్రా మోర్ ల కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది . ఇక ధనుంజయ్ భైరవ పాత్రలో పూర్తిగా అలరించాడు . తన ఫిజిక్ , మేనరిజం తో పూర్తిగా పరాయక ప్రవేశం చేసాడు ధనుంజయ్ . ఇక యాక్షన్ సీన్స్ లో అయితే ఈలలు వేయించాడు . మిగిలిన పాత్రల్లోని నటీనటులంతా తమతమ పాత్రలకు న్యాయం చేసారు టెక్నీకల్ టీమ్  : రవిశంకర్ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . పాటలు అంతంత మాత్రమే కానీ రీ రికార్డింగ్ తో అలరించాడు . విజువల్స్ కూడా బాగున్నాయి , రియలిస్టిక్ అప్రోచ్ తో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది . నిర్మాణ విలువలు ఫరవాలేదు . ఇక 

దర్శకుడు సిద్దార్థ్ విషయానికి వస్తే ..... మంచి పాయింట్ ని ఎంచుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో దాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపించడంలో విఫలమయ్యాడు . అయితే ఇది సిద్దార్థ్ కి మొదటి సినిమానే అయినప్పటికీ అనుభవమున్న దర్శకుడిలా పనిచేసాడు అని మాత్రం చెప్పొచ్చు .  

పంచ్ లైన్ : ఓసారి భైరవగీత ని చూడొచ్చు