అంతరిక్షం రివ్యూ

Starring : వరుణ్ తేజ్ , అదితి రావు హైదరి , లావణ్య త్రిపాఠి

Director : సంకల్ప్ రెడ్డి

Producers : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్

Music Director : ప్రశాంత్ విహారి

Release Date : 21 డిసెంబర్ 2018

Espicy Rating:

ఫిదా , తొలిప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి జోరు మీదున్న హీరో వరుణ్ తేజ్ తాజాగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించిన చిత్రం '' అంతరిక్షం '' . విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపిందిందా ? లేదా ? అన్నది చూద్దామా !

స్టోరీ  :  నీరా శాటిలైట్ ఫెయిల్ అయితే  ప్రపంచం లోని కమ్యూనికేషన్ దెబ్బ తింటుందని భావించి దాన్ని సరైన దిశలో పంపించడానికి  దేవ్ ( వరుణ్ తేజ్ ) ని పిలిపిస్తారు . దేవ్  శాటిలైట్ ని డీ కోడ్ చేయడంలో ఎక్స్ పర్ట్ దాంతో అతడితో కొన్ని విబేధాలు ఉన్నప్పటికీ ఆ మిషన్ ని అతడికి అప్పగిస్తారు . అయితే దేవ్ ఆ మిషన్ విషయం లో  సక్సెస్ అయ్యాడా ? లేదా ? అంతరిక్షం లో తనకు సహకరించిన వాళ్ళు ఎవరు ? విభేదించిన వాళ్ళు ఎవరు ?  అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .  

హైలెట్స్ : వరుణ్ తేజ్ ,కథ, విజువల్స్ ,నేపథ్య సంగీతం, అదితి రావు హైదరి , డైరెక్షన్ ,ప్రొడక్షన్ వేల్యూస్ 

డ్రా బ్యాక్స్ : కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయాల్సి ఉండే 

పెర్ఫార్మెన్స్  : శాటిలైట్ ని డీకోడ్ చేసే దేవ్ పాత్రలో  వరుణ్ తేజ్ నటన అద్భుతమనే చెప్పాలి . డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని అంగీకరించి మంచి ప్రయత్నం చేసాడు వరుణ్ తేజ్ .  . అదితి రావు హైదరీ రియా పాత్రలో మెప్పించింది .  లావణ్య త్రిపాఠి తన పాత్ర మేరకు బాగానే నటించింది . అవసరాల శ్రీనివాస్ , రహమాన్ , సత్యదేవ్ , కునాల్ లతో పాటు మిగతా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు . 

టెక్నీషియన్స్  :  అద్భుతమైన విజువల్స్ అందించిన  జ్ఙానశేఖర్ వి ఎస్ ని తప్పకుండా అభినందించి తీరాలి  . జ్ఙానశేఖర్ విజువల్స్ ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి .  అంతరిక్షం సెట్టింగ్ కి వస్తే అద్భుతాన్ని సృష్టించారు రామకృష్ణ , మౌనిక లు . రంగస్థలం తో సత్తా చాటిన  ఈ జంట పని తీరు అంతరిక్షం లో మరోసారి తమ ప్రతిభని చాటుకున్నారు  . సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి  నేపథ్య సంగీతంతో సినిమాని మరో మెట్టు మీద నిలబెట్టాడు  . రాజీవ్ రెడ్డి - సాయి బాబు - క్రిష్ ల ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేం, ఫస్ట్ ఫ్రేమ్ నిర్మాణ విలువలు బాగున్నాయి  . ఇక దర్శకుడు సంకల్ప్ రెడ్డి విషయానికి వస్తే ......  సంకల్ప్ టాలెంట్ కి అతడి కటౌట్ కి సంబంధమే లేదు . మొదటి సినిమా ఘాజి తోనే తన సత్తా  ఏంటో నిరూపించాడు . రెండో ప్రయత్నంలో మరోసారి ఎవరూ టచ్ చేయని అంతరిక్షంని టచ్ చేసి మరోసారి సత్తా చాటాడు . అద్భుతమైన టాలెంట్ ఉన్న సంకల్ప్ రెడ్డి టాలీవుడ్ ఆణిముత్యం అనే చెప్పాలి . 

ఫైనల్  గా :  తప్పకుండా చూడాల్సిన సినిమా అంతరిక్షం