24 కిస్సెస్ రివ్యూ

Starring : హెబ్బా పటేల్ , అరుణ్ ఆదిత్ , నరేష్

Director : అయోధ్య కుమార్

Producers : సంజయ్ రెడ్డి

Music Director : joi barua

Release Date : 23 నవంబర్ 2018

Espicy Rating:

హెబ్బా పటేల్ - అరుణ్ ఆదిత్ జంటగా నటించిన చిత్రం 24 కిస్సెస్ . అయోధ్య కుమార్ దర్శకత్వంలో సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిందా ? లేదా ? చూద్దాం


స్టోరీ : 

శ్రీలక్ష్మి ( హెబ్బా పటేల్ ) ఆనంద్ ( అరుణ్ ఆదిత్ ) ని ప్రేమిస్తుంది , అయితే ఆనంద్ శ్రీలక్ష్మి తో కేవలం శారీరక వాంఛ తీర్చుకోవడానికి మాత్రమే ఆలోచిస్తుంటాడు . ఆనంద్ ఆలోచనలు తెలియని శ్రీలక్ష్మి అతడు ప్రేమిస్తున్నాడేమో అనుకొని అతడితో అడ్వాన్స్ అవుతుంది . పెళ్లి ప్రపోజల్ ఆనంద్ ముందు పెట్టడంతో అతడు తన నిజ స్వరూపం చూపిస్తాడు . దాంతో ఆనంద్ కు దూరం అవుతుంది . తన లాగే చాలామంది అమ్మాయిలతో ఆనంద్ తిరుగుతున్నాడని తెలుసుకొని షాక్ అవుతుంది శ్రీలక్ష్మి . అయితే ఆనంద్ శ్రీలక్ష్మి ప్రేమని అర్ధం చేసుకున్నాడా ? మళ్ళీ ఇద్దరూ కలుసుకున్నారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ : హెబ్బా పటేల్ ,అరుణ్ ఆదిత్

మైనస్ పాయింట్స్ : డైరెక్షన్ ,స్క్రీన్ ప్లే ,సంగీతం 

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ : 

అమ్మాయిలను వాడుకొని , ఆ అవసరం తీరాకా వదిలేసే పాత్రలో ఆనంద్ అభినయం బాగానే ఉంది , హెబ్బా పటేల్ కూడా శ్రీలక్ష్మి పాత్రలో మెప్పించింది . అయితే నటన కంటే అందాలతోనే ఎక్కువగా ఆకట్టుకుంది హెబ్బా . ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కుర్రాకారు ని ఆకట్టుకునేలా ఉన్నాయి . నరేష్ , రావు రమేష్ లతో పాటుగా మిగతా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు . టెక్నీకల్ టీమ్ : ఉదయ్ అందించిన విజువల్స్ బాగున్నాయి , హెబ్బా పటేల్ గ్లామర్ ని మరింత ఆకర్షణీయంగా ప్రదర్శించాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి . సంగీతం అంతగా ఎట్రాక్టివ్ గా లేదు , చాలా సన్నివేశాలు ఎడిటింగ్ చేయాల్సి ఉంది . ఇక దర్శకుడు విషయానికి వస్తే ...... రొమాంటిక్ సీన్స్ ని బాగా నడిపిన దర్శకుడు మిగతా సన్నివేశాల పట్ల శ్రద్ధ పెట్టకపోవడంతో సినిమా మొత్తం తేలిపోయింది . మొత్తానికి దర్శకుడిగా విఫలం అయ్యాడు అయోధ్య కుమార్ . 

ఫైనల్ గా : తీవ్ర నిరాశకు గురిచేసే సినిమా ఈ 24 కిస్సెస్