118 రివ్యూ

Starring : కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే

Director : కెవి గుహన్

Producers : మహేష్ కోనేరు

Music Director : శేఖర్ చంద్ర

Release Date : 1 మార్చి 2019

Espicy Rating:

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే . 

స్టోరీ : 

గౌతమ్ ( నందమూరి కళ్యాణ్ రామ్ ) జర్నలిస్ట్ , అయితే ఎవరో అమ్మాయిని చంపేస్తున్నట్లుగా కల వస్తుంది . దాన్ని లైట్ గానే తీసుకుంటాడు అయితే అదే కల మళ్ళీ వస్తుంది దాంతో ఆ కల ఎందుకు వచ్చింది , అన్న ఆలోచనతో దర్యాప్తు చేస్తాడు . ఆ పరిశోధనలో ఆద్య (నివేదా థామస్ ) అనే యువతి మిస్ అయినట్లు తెలుసుకుంటాడు గౌతమ్ . అసలు ఆద్య ఎవరు ? గౌతమ్ కు కలలోకి ఎందుకు వస్తుంది ? ఆ కలని ఛేదించే క్రమంలో గౌతమ్ ఎదురుకొన్న ఇబ్బందులు ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ : 

నందమూరి కళ్యాణ్ రామ్ 

నివేదా థామస్ 

రీ రికార్డింగ్  

డైరెక్షన్ 

డ్రా బ్యాక్స్ : 

ఎంటర్ టైన్ మెంట్ 

పెర్ఫార్మెన్స్ : 

జర్నలిస్ట్ గౌతమ్ పాత్రలో కళ్యాణ్ రామ్ లుక్స్ , స్టైల్ బాగుంది . అలాగే తన పాత్రని అద్భుతంగా పోషించి మరోసారి తన విభిన్నతని చాటి చెప్పాడు . నివేదా థామస్ పాత్ర తక్కువే అయినప్పటికీ కథలో కీలకమైన పాత్ర కావడం విశేషం . ఆ పాత్రని పోషించి నివేదా థామస్ కు ఛాంలెంజింగ్ రోల్ రావడంతో తన సత్తా చాటింది . షాలిని పాండే పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు , కానీ ఉన్నంతలో బాగానే చేసింది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల్లో రాణించారు . 

టెక్నికల్ టీమ్ : 

విభిన్న తరహా కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడ్ని  తప్పకుండా అభినందించాలి . వినూత్న కథ ని ఎంచుకోవడమే కాకుండా దాన్నిసరైన దిశలో నడిపించిన తీరుకి కెవి గుహన్ ని మెచ్చుకోవలసిందే . శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . నిర్మాణ విలువలు ఫరవాలేదు . విజువల్స్ బాగున్నాయి . 

ఫైనల్ గా : 

రొటీన్ కి భిన్నమైన చిత్రాలను కోరుకునే వాళ్లకు మంచి ఛాయిస్ 118