ఉపాసన పై రాజకీయ కుట్ర

Published on Jan 29,2019 12:06 PM

చిరంజీవి కోడలు చరణ్ భార్య అయిన ఉపాసన పై రాజకీయ కుట్ర కు పాల్పడుతున్నారు . చేవెళ్ల పార్లమెంట్ మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై అధికార పార్టీ టీఆర్ఎస్ తరుపున ఉపాసన పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది అన్నట్లుగా ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తలు వచ్చాయి అయితే అవి ఉపాసన దృష్టికి రాగానే వెంటనే ఖండించింది . చేవెళ్ల నుండి పోటీ చేయబోవడం లేదు , పైగా మా చిన్నాన్న ( కొండా విశ్వేశ్వర్ రెడ్డి ) చేవెళ్ల లో చాలా మంచి పనులు చేసున్నాడు అంటూ ఆ గాలి వార్తలను కొట్టి పడేసింది ఉపాసన . 

అంతేకాదు అపోలో ఆసుపత్రిలో నాకు బోలెడు పనులు ఉన్నాయి వాటిని నిర్వహించాలి అంటూ పోస్ట్ పెట్టేసింది ఉపాసన . చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడైన కొండా టీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే . మరో మూడు నెలల్లో పార్లమెంట్ కు ఎన్నికలు వస్తుండటంతో ఈ ఊహాగానాలు వచ్చాయి , దానికి తోడు కేటీఆర్ కు మంచి ఫ్రెండ్ ఉపాసన అందుకే ఇలా వార్తలు పుట్టుకొచ్చాయి .