టీవీ ఆర్టిస్ట్ ఝాన్సీ ఆత్మహత్య

Published on Feb 06,2019 12:25 PM

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది . మాటీవీ లో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో నటించిన ఝాన్సీ ఇటు సీరియల్ లకు దూరమై అటు కోరుకున్న ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది . ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియడంతో బుల్లితెర తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యింది . 

మాటీవీలో ప్రసారమయ్యే పవిత్ర బంధం సీరియల్ లో చేస్తున్న సమయంలో సూర్య తో పరిచయం కాస్త ప్రేమగా మారింది . దాంతో అతడితో సహజీవనం కూడా చేసిందట ఝాన్సీ . అయితే పెళ్లి చేసుకుందామని ఎంతగా పోరు పెట్టినప్పటికీ సూర్య నిరాకరించడంతో అటు కెరీర్ పోయి ఇటు ప్రేమలో విఫలం కావడంతో సూసైడ్ చేసుకుంది . ఝాన్సీ ఆత్మహత్య ని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు .