తెలంగాణలో కేసీఆర్ దే హవా

Published on Dec 11,2018 11:59 AM

తెలంగాణలో కేసీఆర్ దే హవా అని మరోసారి తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో నిరూపించారు . డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ జరుగగా ఈరోజు ఫలితాలు వెలువడుతున్నాయి . ఇక ఏకపక్షంగా ఫలితాలు వస్తుండటంతో కాంగ్రెస్ - టీడీపీ కూటమి కళ్ళు బైర్లు కమ్మాయి . కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందుతుండటంతో అసలు ఏం మాట్లాడాలో తెలీక ముఖం చాటేస్తున్నారు . కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి దాదాపు 90 నియోజకవర్గాల్లో దూసుకుపోతోంది . 

పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తున్నాడు కేసీఆర్ . తెలంగాణలో అన్ని చోట్లా కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారు . తెలంగాణ లో ఇతర చోట్లా మాత్రమే కాదు హైదరాబాద్  నగరంలో కూడా టీఆర్ఎస్ కు అత్యధికంగా ఓట్లు రావడం సంచలనంగా మారింది . మొత్తానికి ఈ ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ కూటమి గా మారింది తప్ప ఇతర అభ్యర్థులు కాదని స్పష్టం అయ్యింది .