జనవరి మొదటి వారంలో తెలంగాణ కాబినెట్ విస్తరణ?

Published on Dec 29,2018 11:49 AM

తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టి ఆర్ స్  అధ్యక్షుడు , ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర రావు  మంత్రివర్గాన్ని విస్తరించే పనిలో పడ్డారు. రేపు(డిసెంబర్ 30) కానీ  - జనవరి మొదటి వారంలో కాని మంత్రివర్గాన్ని విస్తరించే పని చేపడతారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు  చెబుతున్నారు. ఈ క్యాబినెట్ లో 18 మందికి చోటు దక్కనుంది అని సమాచారం . తెలంగాణ ముఖ్యమంత్రి  జాతీయ రాజకీయాల వైపు శ్రద్ధ పెట్టేందుకు పార్టీ పగ్గాలను తన కుమారుడు కే టి ర్  కి  అప్పగించారు. ఆయన కూడా పార్టీని పటిష్టం చేసే పనిని ప్రారంభించారు. 

గత క్యాబినెట్ లో మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవిని మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఈసారి మంత్రి వర్గంలో మహిళలకు కచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గంలోని సీనియర్లను తీసుకోకుండా యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి - హోమంత్రి కలిపి ఇద్దరు మంత్రులున్నారు. ఇక మిగిలిన 16 మంత్రిపదవులు ఎవరిని వరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.