అలీ కి చురకలంటించిన పవన్ కళ్యాణ్

Published on Apr 04,2019 10:10 AM

పవన్ కళ్యాణ్ తన మిత్రుడు అలీ కి చురకలంటించారు . హాస్య నటుడు అలీ పవన్ కళ్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీని కాదని జగన్ పార్టీ అయిన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే . అయితే మిమ్మల్ని కాదని జగన్ పంచన అలీ ఎందుకు చేరాడు అని పవన్ ని ప్రశ్నించినప్పుడు జగన్ నాకంటే బలమైన నాయకుడు అని అలీ భావించి ఉండొచ్చు అంటూ అలీ కి చురకలంటించాడు . 

అంతేకాదు నా పార్టీలో చేరితే తన భవిష్యత్ బాగుండదేమో అని భావించాడేమో ! జగన్ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని అనుకోని ఉంటాడని అయినా నాకు అలీ ఇప్పటికి కూడా మంచి మిత్రుడే అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ . హాస్య నటుడు అలీ రకరకాల పార్టీల గురించి ఆలోచించి చివరకు జగన్ పార్టీలో చేరడంతో పవన్ తో పాటుగా చిత్ర పరిశ్రమలోని వాళ్ళు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే పవన్ - అలీ ఇద్దరు కూడా మంచి మిత్రులు మరి .