పవన్ కళ్యాణ్ - అలీ ల మధ్య గొడవ

Published on Apr 09,2019 10:05 AM

రాజకీయాలు శత్రువులను మిత్రులుగా మారుస్తుంది , మిత్రులను శత్రువులుగా మారుస్తుంది అంటే ఇదే కాబోలు . పవన్ కళ్యాణ్ - అలీ లు మంచి స్నేహితులు కానీ రాజకీయంగా ఎవరి దారి వారిదే ! కానీ ఇద్దరూ ఇపుడు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు . అలీ నమ్మక ద్రోహం చేసాడని పవన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయగా అలీ కూడా తక్కువేమి తినలేదు అదే  స్థాయిలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసాడు అలీ . 

నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి వెళ్లిన పవన్ కళ్యాణ్ అలీ పై విమర్శలు చేసాడు . జనసేన పార్టీలోకి వస్తాడని అనుకున్నాను కానీ పవన్ కంటే జగన్ వల్లే ఎక్కువ లాభం అనుకున్నాడేమో అందుకే జగన్ పార్టీలో చేరాడని , అందుకే నాకు బంధువులు కానీ మిత్రులు కానీ లేరని , అలాంటి వాళ్ళని నమ్మనని ప్రజలే నాకు బంధు మిత్రులు అంటూ చెప్పుకొచ్చాడు . 

ఇక అలీ కూడా తక్కువేమి తినలేదు పవన్ కళ్యాణ్ పై అదే స్థాయిలో విమర్శలు చేసాడు . అలీ ని ఆదుకున్నాను అని అన్నావ్ ! నాకేమైనా వేషాలు ఇప్పించావా ? లేక డబ్బులు ఇచ్చావా ? నేను జగన్ పార్టీలో చేరితే తప్పేంటి ? అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డాడు అలీ.