విషాదం :పవన్ కళ్యాణ్ అభిమాని మృతి

Published on Mar 30,2019 03:18 PM

నంద్యాల లో విషాదం నెలకొంది . పవన్ కళ్యాణ్ అభిమాని సిరాజ్ మృతి చెందడంతో సిరాజ్ కుటుంబంలో విషాదం నెలకొంది అలాగే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా . నంద్యాల కు చెందిన సిరాజ్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని తన అభిమాన హీరోని చూడటానికి జనసేన సభకు వెళ్ళాడు . సభ కోసం ఏర్పాటు చేసిన మైక్ సెట్ పైకి ఎక్కాడు . 

మైక్ సెట్ ల కోసం ఏర్పాటు చేసిన ఇనపరాడ్ లు ప్రజల దాటని తట్టుకోలేక కుప్పకూలింది . దాంతో మైక్ సెట్ మీద ఉన్న సిరాజ్ కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు . సిరాజ్ ఆటో నడుపుకుంటూ బ్రతుకుతున్నాడు . అయితే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ని చూడటానికి , పవన్ మాటలు వినడానికి వచ్చిన సిరాజ్ చనిపోవడంతో అక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి .