కేటీఆర్ ని కలిసి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్

Published on Dec 20,2018 04:17 PM

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుని కలిసి ఎన్టీఆర్ పిచ్చ షాక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కి అలాగే బాబాయ్ బాలకృష్ణ కు. ఇటీవలే తెలంగాణలో అసెంబ్లీ కి ఎన్నికలు జరుగగా కూకట్ పల్లి నుండి నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యింది. అక్క కోసం ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. దాంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ పై ఆగ్రహం గా ఉన్నారు. 

ఇక ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ కేటీఆర్ ని ఓ ఫంక్షన్లలో కలవడం సంచలనం సృష్టిస్తోంది. ఎన్టీఆర్ కేటీఆర్ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అక్క కోసం ప్రచారం చేయడం ఇష్టం లేని తమ్ముడు ప్రత్యర్థి పార్టీ నాయకుడితో మాత్రం కలిసి ఫోటో దిగడం ఏంటి ? అని విమర్శిస్తున్నారు నెటిజన్లు. అయితే ఎన్టీఆర్ పై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఎన్టీఆర్ నే సమర్దిస్తున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అప్పట్లో చురుగ్గా పాల్గొన్నాడు కానీ చంద్రబాబు వ్యవహారం వల్ల ఎన్టీఆర్ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.