అరెస్ట్ వార్తలను ఖండించిన మోహన్ బాబు

Published on Apr 02,2019 05:32 PM

చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు మోహన్ బాబు అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో వెంటనే అప్రమత్తమైన మోహన్ బాబు అరెస్ట్ వార్తలను ఖండించాడు . చెక్ బౌన్స్ కేసులో దర్శకులు వైవీఎస్ చౌదరి కోర్టు ని తప్పుదోవ పట్టించాడని అందువల్ల కోర్టు తీర్పు అతడికి మద్దతుగా నాకు వ్యతిరేకంగా వచ్చిందని అయితే వెంటనే కోర్టు నాకు బెయిల్ కూడా మంజార్ చేసిందని ఓ ప్రకటనలో తెలిపాడు మోహన్ బాబు . 

అంతేకాదు వైవీఎస్ చౌదరి మీద  పై కోర్టుకి వెళ్తున్నామని , అతడి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తామని ...... నేను మరో సినిమా కోసం ఇచ్చిన చెక్ ని ఇలా దుర్వినియోగం చేసాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు మోహన్ బాబు