మోహన్ బాబు కు బెదిరింపులు

Published on Apr 04,2019 10:20 AM

నటుడు మోహన్ బాబు కు గతకొద్ది రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ అదేపనిగా వస్తుండటంతో హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు . మోహన్ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ ని పరిశీలించగా వచ్చిన బెదిరింపు కాల్స్ విదేశాల నుండి వచ్చినట్లుగా తెలిసింది . మోహన్ బాబు కొద్దిరోజులుగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని , చంద్రబాబు నాయుడి ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే . 

దాంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . తెలుగుదేశం ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేసిన మోహన్ బాబు ఆ తర్వాత జగన్ పార్టీలో చేరాడు . ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండటంతో రాజకీయ వేడి రాజుకుంది .