చంద్రబాబు పై నిప్పులు కక్కిన మోహన్ బాబు

Published on Mar 22,2019 12:06 PM

మోహన్ బాబు చంద్రబాబు పై నిప్పులు కక్కాడు . ఈరోజు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించడానికి ఉపక్రమించిన తరుణంలో పోలీసులు మోహన్ బాబు ని చుట్టుముట్టారు . దాంతో జగన్ మీడియా సాక్షి ఈ తతంగమంతా చిత్రీకరించింది . తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ది కానీ ఇది నా పార్టీ ....... నా పార్టీ అంటావేంటి ? అయినా ఇన్ని కోట్లు సంపాదించావ్ ? ఏం చేసుకుంటావ్ ? రేపు ఏమౌతావో ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు . 

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ గురించి లేఖలు రాస్తే చంద్రబాబు పట్టించుకోలేదని , అంత అహంకారం అవసరమా ? అంటూ చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు మోహన్ బాబు . ఇక ఈ ఆందోళనలో మోహన్ బాబు వెంట మంచు విష్ణు , మంచు మనోజ్ లు పాల్గొన్నారు .