ఏపీ సీఎం చంద్రబాబు ఫై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్

Published on Dec 31,2018 12:46 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మీడియా ముందుకు వచ్చి తన ప్రత్యర్థి ఏపీ సీఎం చంద్రబాబు ఫై విమర్శనా అస్త్రాలు సందించారు .

ప్రెస్ మీట్ లోని అంశాలు :

చంద్రబాబంతా డర్టీయస్ట్ పోలిటిషియన్ ఇవాళ దేశంలో ఎవరూ లేదు. 

నవీన్ పట్నాయక్ ను ఎందుకు కలిశావు ఎల్లయ్యను ఎందుకు కలిశావు - మల్లయ్యను ఎందుకు కలిశావు. అని అడుగుతున్నారు  అవన్నీ ఆయనకేం అవసరం? 

నాలుగేళ్లు మోదీసంకలో ఉన్నావు. అప్పుడు మేం మోదీని పొగడాలా. ఇప్పుడు నువ్వు రాహుల్ సంకలోకి ఎక్కగానే, మేమూ కాంగ్రెస్ వెంబడి రావాలా, రాహుల్ గాంధీ విజయవాడ వస్తున్నాడంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని ప్రశ్నించాడు. నిన్న నరేంద్ర మోదీ వస్తున్నాడంటే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడని మాట్లాడుతున్నాడు. అసలు నీదేం మొఖం నాకర్థం కాదు

బాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ను భరిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేతులెత్తి మొక్కాలి. ఎన్ని పచ్చి అబద్ధాలు! సిగ్గుపడాలి చంద్రబాబు! 

చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు పేలుతున్నాడు. ఆయన నోటికి మొక్కాలి. రాష్ట్రం విడిపోయి అయిదేళ్లు అయ్యింది. మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ నాయకుడైనా వాళ్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ల హైకోర్టు వాళ్ల దగ్గరకు మార్చుకోవాలి. ఈ అడ్డగోలు మాటలకు ఏమైనా అర్థముందా? . దానికి ఒకటి రెండు పత్రికలు బాకా కొట్టడం! ప్రతి రోజూ ఇదే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఇదో పెద్ద డ్రామా అయిపోయింది

చంద్రబాబు యూజ్ అండ్ త్రోలో నంబర్ వన్. మొన్న అమాయకురాలైన హరికృష్ణ బిడ్డ ను నిలబెట్టాడు. ఇప్పుడేమైనా న్యాయం చేస్తావా ఆ అమ్మాయికి? ఏమీ చేయడు. ఎన్నికల ముందు వాడుకోవాలి అంతే!చంద్రబాబుకు నాలుగు వాక్యాలు చక్కగా ఇంగ్లిష్ లో మాట్లాటం వస్తుందా? రెండు సెంటెన్స్ లు హిందీలో మాట్లాడటం వస్తుందా? ఇక... ఢిల్లీలో చక్రం ఎలా తిప్పాలి? అంతా ఒట్టిదే.. డొల్ల. చక్రం లేదు - చింపింది లేదు. చచ్చింది లేదు!