న్యూజిలాండ్ ఫై ఘన విజయం సాధించిన ఇండియా

Published on Jan 28,2019 03:22 PM

న్యూజిలాండ్ లో ఇండియా దూసుకుపోతుంది. న్యూజిలాండ్ లోని  మౌంట్  మౌనంగానూయి  లో జరిగిన మూడో వన్డే లో ఇండియా ఘన విజయం సాధించింది.ఐదు వన్డేలు సిరీస్ లో భాగంగా వరుసగా మూడు వన్డేలు గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా లో సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లీ సేన మరోమారు న్యూజీలాండ్ లో కూడా క్లీన్ స్వీప్ దిశగా సాగుతుంది.స్థానిక మౌంట్  మౌనంగానూయి జరిగిన మూడో వన్డే లో తొలుత బాటింగ్ చేసిన న్యూజిలాండ్ 243  పరుగులకే అల్ ఔట్ కాగా కోహ్లీ సేన మూడు వికెట్లు కోల్పోయి లక్షాన్ని ఛేదించింది.బాటింగ్ లో రోహిత్ (62),ధావన్ (28),కోహ్లీ(60) పరుగులుగా చేసి అవుట్ య్యారు.రాయుడు (40),కార్తీక్ (38) పరుగులు చేసి విజయాన్ని అందించారు.