తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన హీరోయిన్

Published on Dec 12,2018 03:23 PM

ఈరోజుల్లో చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన భామ రేష్మ . మారుతి దర్శకత్వం వహించిన ఈరోజుల్లో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రేష్మ తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ స్థానం నుండో పోటీ చేసింది . అయితే భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది . ఈ భామకు సమాజసేవ చేయాలనే ఆశ ఉండేది దాంతో రాజకీయాల్లోకి వెళ్ళింది . 

అయితే మరో పార్టీ నుండి పోటీ చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ ఏమాత్రం బలం లేని భారతీయ జనతా పార్టీ తరుపున పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది . ఈరోజుల్లో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ అవేవి ఈ భామకు కెరీర్ పరంగా ఉపయోగపడలేదు . దాంతో సినిమాలు పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాలని బిజెపి లో చేరింది దెబ్బతింది . దాంతో రెంటికి చెడిన రేవడిలా తయారయ్యింది రేష్మ పరిస్థితి .