ప్రభాస్ కు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Published on Dec 18,2018 10:53 AM

హీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని సీజ్ చేసి అతడికి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం . శేరిలింగం పల్లి రాయదుర్గం లోని 46 సర్వే నెంబర్ లో 2200 గజాల స్థలంలో ప్రభాస్ తన గెస్ట్ హౌజ్ కట్టుకున్నాడు . అయితే ఈ కట్టడం అక్రమమని అంతేకాకుండా అది ప్రభుత్వ స్థలమని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకేకింది . కోర్టు తీర్పు ప్రకారం ప్రభాస్ కట్టుకున్న గెస్ట్ హౌజ్ ప్రభుత్వ స్థలమని తేల్చి చెప్పింది . 

దాంతో కోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభాస్ గెస్ట్ హౌజ్ ని సీజ్ చేసారు అధికారులు . ప్రభాస్ గెస్ట్ హౌజ్ కు తాళాలు వేయడమే కాకుండా సీజ్ చేసి నోటీసులు అంటించారు . ప్రభుత్వ అధికారులు నోటీసులు అంటించారు కాబట్టి గెస్ట్ హౌజ్ ఇక అధికార్ల అధీనంలో ఉండనుంది . అయితే కొద్దికాలం క్రితమే రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు ప్రభాస్ . మరి తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ పట్ల సానుకూలంగా స్పందించి రెగ్యులరైజ్ చేస్తుందా ? లేక అక్రమ కట్టడం అని కూల్చుతుందా చూడాలి .