మళ్ళీ జగన్ పార్టీలో చేరిన డాక్టర్ రాజశేఖర్ -జీవిత

Published on Apr 02,2019 05:01 PM

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ - జీవితలు మళ్ళీ జగన్ పార్టీలో చేరారు.  ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోగల జగన్ ఇంటికి వెళ్లి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రాజశేఖర్ దంపతులు . గతంలో జగన్ పంచన చేరిన ఈ దంపతులు , జగన్ వ్యవహారశైలి నచ్చక వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చారు , అంతేకాదు జగన్ ని అనరాని మాటలు అన్నారు కూడా . 

కట్ చేస్తే ఏడేళ్ల తర్వాత మళ్ళీ జగన్ పార్టీలో చేరారు రాజశేఖర్ దంపతులు . అయితే ఈసారి జగన్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని , అతడి తరుపున ప్రచారం చేస్తామని అంటున్నారు రాజశేఖర్ - జీవితలు . విచిత్రం ఏంటంటే ఈ దంపతులు కమ్యూనిస్ట్ పార్టీ లు తప్ప మిగతా అన్ని పార్టీలలో చేరారు , బయటకు వచ్చారు .