రాఫెల్ పై ఘాటుగా స్పందించిన రక్షణమంత్రి నిర్మలా సీతా రామన్!

Published on Jan 05,2019 11:46 AM

రాఫేల్ యుద్ద విమానాల తయారీ కుంభకోణ విషయం లో,లోక్ సభలో రాఫేల్ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మరియు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  మధ్య చాల ఘాటైన చర్చ జరిగింది. రాఫేల్  యుద్ధ విమానాల కాంట్రాక్టులోకి అంబానీని ఎవరు తీసుకువచ్చారని,రాఫేల్ డీల్ కుంభకోణంలో ప్రధాని మోడీ  పాత్ర ఉందన్న ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు.అనిల్ అంబానీ పేరును ప్రధాని మోదీయే సూచించారని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే వెల్లడించినట్లు రాహుల్ గాంధీ  అన్నారు దీనిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  ఘాటైన  సమాధానం చెప్పారు.

బీజేపీకి జాతీయ భద్రతే ముఖ్యమని, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. మన పక్కన పొరుగుదేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంటే చూస్తూ కూర్చోమని ఆమె ఘాటుగా స్పందించారు. యూపీఏ ప్రభుత్వ ఉన్నపుడు  కేవలం 18 రఫేల్ యుధ్ధ విమానాల కొనుగోలుకు ప్రయత్నించిందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి సంఖ్యను 36కు పెంచామని ఆమె చెప్పారు. యూపీఏ హాయంలో లాగా తమకు 10 ఏళ్లు పట్టలేదని కేవలం 14 నెలల వ్యవధిలోనే ఒప్పందాన్ని పూర్తి చేశామని ఆమె తెలిపారు. 

2016 సెప్టెంబర్ 23 నాటి ఒప్పందం మేరకు భారత్ కొనుగోలు చేసిన తొలి రఫేల్ యుధ్ధ విమానం సెప్టెంబర్ లో ఇండియాకు వస్తుందని, మిగిలిన విమానాలు 2022కి అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రఫేల్ విమానాల కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆమె అన్నారు. దేశంలో యుధ్దవిమానాల తయారీ హెచ్ఏఎల్ ను కాదని  విదేశాలకు ఎందుకిచ్చారని,  రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ. హెచ్ ఎఎల్ పనితనం విషయమే కాదు లోపాలు కూడా రాహుల్ గాంధీ  తెలుసుకోవాలని ఆమె వివరించారు.  తేజస్ విషయంలో హెచ్ ఎఎల్ పనితనంలో వెనుక బడిందన. 43 ఆర్డర్ ఇస్తే కేవలం  8 విమానాలు మాత్రమే సమకూర్చారని ఆమె వివరించారు. 

సైనిక దళాలు నిరంతం అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి ఉందని , సరైన సమయంలో ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని నిర్మల సీతారామన్ తెలిపారు. 2004 నుంచి 2015 వరకు చైనా సుమారు 400 విమానాలను సమకూర్చుకుంది, పొరుగున ఉన్న  పాకిస్థాన్ కూడా తన వైమానిక దళాన్ని రెండింతలు చేసిందని కానీ  ప్రస్తుతం భారత్ లో కేవలం 32 స్క్వాడ్రన్ ల బలం మాత్రమే ఉందని మంత్రి తెలిపారు. ఆయుధాల అవసరాన్ని గుర్తించాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు. 36వ రాఫేల్ 2022లో డెలివరీ అవుతుందని మంత్రి చెప్పారు.