మోహన్ బాబు కి ఏడాది జైలు శిక్ష

Published on Apr 02,2019 03:32 PM
సినీ నటుడు మంచు మోహన్ బాబు కి ఏడాది జైలు శిక్ష విధించింది హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలలోకి వెళితే ....... 2010 లో దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా '' సలీం '' అనే చిత్రం రూపొందింది . అయితే ఆ సినిమాకు గాను వైవీఎస్ చౌదరి కి రెమ్యునరేషన్ కింద ఇచ్చిన 48 లక్షల చెక్ బౌన్స్ అయ్యింది. 
దాంతో ఆ చెక్ తో కేసు వేసాడు వైవీఎస్ చౌదరి . ఆ చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబు కి ఏడాది జైలు శిక్ష తో పాటుగా 41 లక్షల జరిమానా కూడా విధించింది . అయితే ఏడాది జైలు శిక్ష పడటంతో వెంటనే బెయిల్ కు అప్లయ్ చేసుకోగా మోహన్ బాబు కి బెయిల్ మంజూరు అయ్యింది . దాంతో అరెస్ట్ నుండి తప్పించుకున్నాడు మోహన్ బాబు.