అమీషా పటేల్ పై చీటింగ్ కేసు

Published on Feb 18,2019 05:02 PM

పవన్ కళ్యాణ్ సరసన బద్రి చిత్రంలో నటించిన భామ అమీషా పటేల్ . ఆ సినిమా తర్వాత మహేష్ బాబు తో నాని సినిమాలో , ఎన్టీఆర్ తో అలాగే బాలకృష్ణ తో నటించింది ఈ బాలీవుడ్ భామ . అయితే ఆ తర్వాత అమీషా పటేల్ నటించిన చిత్రాలేవీ హిట్ కాకపోవడంతో మళ్ళీ తెలుగులో ఛాన్స్ లు రాలేదు ఈ భామకు . అయితే తాజాగా అమీషా పటేల్ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.

 2016 లో ఓ పెళ్లి లో డ్యాన్స్ చేస్తానని చెప్పి 11 లక్షలు తీసుకుందట కానీ తీరా సమయానికి మరో రెండు లక్షలు అదనంగా డిమాండ్ చేయడమే కాకుండా పెళ్లి  వేడుకలో డ్యాన్స్ చేయకుండా ఎగనామం పెట్టింది దాంతో ఆ నిర్వాహకుడు కోర్టు ని ఆశ్రయించగా అమీషా పటేల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మర్చి 12 లోగా కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది . దాంతో కోర్టు ఎదుట హాజరు కావలసిన సందర్భం ఏడ్పడింది అమీషా పటేల్ కు .