న్యూస్ యాంకర్ ఆత్మహత్య

Published on Dec 15,2018 11:42 AM

ఉత్తరప్రదేశ్ లోని ఓ న్యూస్ ఛానల్ లో పనిచేసే యాంకర్ రాధికా కౌశిక్ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది . న్యూస్ యాంకర్ రాధికా కౌశిక్ - మరో యాంకర్ రాహుల్ ఇద్దరూ కొంతకాలంగా నోయిడా లోని అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకొని సహజీవనం చేస్తున్నారు . కాగా నిన్న ఉదయం నుండి జాబ్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఇద్దరు కూడా మద్యం సేవించారు . అయితే మద్యం మత్తులో ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నాలుగో అంతస్థు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది రాధికా కౌశిక్ . 

ఈ విషయాన్నీ పోలీసులకు అక్కడి వాచ్ మెన్ ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు రాహుల్ ని అరెస్ట్ చేసి తమ అదుపులో ఉంచుకున్నారు . నేను బాత్ రూంలోకి వెళ్లిన సమయంలో రాధికా ఆత్మాహత్య చేసుకుందని అందుకే ఆమెని కాపాడలేక పోయానని చెబుతున్నాడు రాహుల్ . రాధికా కౌశిక్ ఆత్మహత్య చేసుకుందా ? లేక హత్య చేసారా ? అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . రాధికా - రాహుల్ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు .