బ్లాక్ బస్టర్ దిశగా యాత్ర

Published on Feb 08,2019 05:28 PM

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర చిత్రానికి యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చింది . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన యాత్ర చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు . ఇక వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తల హంగామా అయితే మాటల్లో చెప్పలేం . మమ్ముట్టి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేసాడని కొనియాడుతున్నారు . 

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో జీవించి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు . మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు , ఆశ్రిత వేముగంటి , అనసూయ , పోసాని , రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటించారు . యాత్ర చిత్రాన్ని చూస్తూ కంటతడి పెడుతున్నది  ప్రేక్షక లోకం దాంతో యాత్ర చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది .