పైరసీ బారిన పడిన యాత్ర

Published on Feb 09,2019 10:34 AM

కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర చిత్రం పైరసీ బారిన పడింది . నిన్ననే ఈ సినిమా రిలీజ్ కాగా రిలీజ్ అయిన కొద్దిగంటల్లోనే యాత్ర పూర్తి చిత్రాన్ని తమిళ రాకర్స్ తమ సైట్ లో పెట్టేసారు అంతేకాదు ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోండి అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు . మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన చిత్రం ఈ యాత్ర . 

మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది . అలాగే రాజశేఖర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు . సినిమాకు హిట్ టాక్ వచ్చింది , ప్రశంసలు అందుతున్నాయి అని సంతోషంలో ఉన్న చిత్ర బృందానికి షాక్ ఇచ్చారు తమిళ రాకర్స్ . తమ సినిమా పైరసీ అయ్యిందని తెలిసి బాధపడుతున్నారు యాత్ర బృందం .