ఘనంగా జరిగిన వెంకటేష్ కూతురు పెళ్లి

Published on Mar 25,2019 12:42 PM

రాజస్థాన్ లో సీనియర్ హీరో వెంకటేష్ కూతురు పెళ్లి ఘనంగా జరిగింది నిన్న . వేంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ది ప్రేమ వివాహం . సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డి తో నిన్న పలువురు సినీ ప్రముఖులు , ఇరు కుటుంబాల బంధుమిత్రుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది . ఆశ్రిత - వినాయక్ రెడ్డి ల ప్రేమకు ఇరు కుటుంబాలు ఆమోదం తెలపడంతో ఈ ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . 

ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ , చరణ్ - ఉపాసన , నాగచైతన్య - సమంత , రానా లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు . రాజస్థాన్ లో పెళ్లి కావడంతో హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసారు వెంకటేష్ . ఎఫ్ 2 తో ఇటీవలే సంచలన విజయం అందుకున్న వెంకటేష్ కూతురు పెళ్లితో మరింత సంతోషంగా ఉన్నాడు.