టైటిల్ వివాదంలో విజయ్ దేవరకొండ చిత్రం

Published on Mar 14,2019 10:42 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం టైటిల్ వివాదంలో ఇరుక్కుంది . విజయ్ దేవరకొండ త్వరలో నటించబోయే కొత్త సినిమాకు '' హీరో '' అనే టైటిల్ ని పెట్టుకున్నారు . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ బాషలలో ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ . అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది . తమిళంలో హీరో శివ కార్తికేయన్ కూడా '' హీరో '' అనే టైటిల్ తో ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేసాడు. 

దాంతో విజయ్ దేవరకొండ కు హీరో టైటిల్ సమస్య వచ్చింది . పైగా మాకు ఫిలిం ఛాంబర్ నుండి అనుమతి లభించింది అంటూ హీరో టైటిల్ పై ఆధారాలు కూడా చూపిస్తున్నారు . శివకార్తికేయన్ కు ఆల్రెడీ టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి విజయ్ దేవరకొండ తమిళ్ లో మరో టైటిల్ పెట్టుకోవాల్సిందే.