కబీర్ సింగ్ టీజర్ వచ్చేసింది

Published on Apr 08,2019 04:43 PM

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . విజయ్ దేవరకొండ - షాలిని పాండే జంటగా నటించగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు . ఇక షాహిద్ కపూర్ - కియారా అద్వానీ జంటగా నటించగా హిందీలో కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు . ఇక ఈరోజు కబీర్ సింగ్ టీజర్ ని రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం . 

టీజర్ చూస్తుంటే అచ్చం అర్జున్ రెడ్డి లాగే ఉంది , అయితే అర్జున్ రెడ్డి చిత్రం వచ్చి అప్పుడే మూడేళ్లు కావస్తోంది పైగా హిందీలో అంటే ఇంకా బెటర్ గా మార్పులు చేయాల్సి ఉంటుంది . కానీ సందీప్ టీజర్ చూస్తుంటే పెద్దగా మార్పులు చేసినట్లుగా కనిపించడం లేదు మరి . త్వరలోనే ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక సినిమాని జూన్ 21న రిలీజ్ చేయనున్నారు . తెలుగులో సంచలనం సృష్టించిన ఈ చిత్రం హిందీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి .