సారా అలీఖాన్ ఆ హీరోతో ఎఫైర్ లేదంటోంది

Published on Jan 30,2019 11:51 AM

సైఫ్ అలీఖాన్ కూతురు హీరోయిన్ సారా అలీఖాన్ పై బాలీవుడ్ లో బోలెడు రూమర్లు వస్తున్నాయి . యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి నటించడం వల్ల అతడితో ఎఫైర్ నడిపిస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది . దాంతో ఈ విషయం సారా చెవిన పడటంతో అవన్నీ గాలి వార్తలు మాత్రమే అంటూ అసలు విషయాన్నీ పనిలో పనిగా చెప్పేసింది . 

నేను ప్రేమిస్తోంది వీర్ పహారియా ని మాత్రమే ! అంతేకాని సుశాంత్ సింగ్ తో నాకు ఎలాంటి ఎఫైర్ లేదని తేల్చి చెప్పింది . అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ఎఫైర్ లేదని చెప్పింది కానీ మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాని ప్రేమిస్తోంది . నేను వీర్ ని తప్ప ఇంతవరకు ఎవరితో ఎఫైర్ లేదని స్పష్టం చేసింది .