50 కోట్ల క్లబ్ లో చేరిన మజిలీ

Published on Apr 15,2019 02:18 PM

సమంత - నాగచైతన్య జంటగా నటించిన మజిలీ చిత్రం 50 కోట్ల క్లబ్ లో చేరింది . ఏప్రిల్ 5 న విడుదలైన మజిలీ చిత్రం మొత్తం 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మించింది . ఇక గోపీసుందర్ పాటలకు సంగీతం అందించగా నేపథ్య సంగీతాన్ని మాత్రం తమన్ అందించాడు . 

ఏప్రిల్ 5 న రిలీజ్ అయిన మజిలీ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్లు వస్తున్నాయి , అయితే ఓవర్ సీస్ లో మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు . మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా మజిలీ 50 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించడంతో ఈ సినిమాని కొనుక్కున్న బయ్యర్ లంతా పెట్టిన పెట్టుబడి ని రాబట్టుకున్నారు లాభాల్లో పయనిస్తున్నారు . నాగచైతన్యకు మంచి హిట్ రావడంతో సమంత చాలా సంతోషంగా ఉంది . భర్తకు హిట్ రావాలని మొక్కుకుంది సమంత కట్ చేస్తే ఆ మొక్కు లు ఫలించి హిట్ దక్కింది .