18 కోట్ల వ్యూస్ తో రికార్డ్ సృష్టించిన రౌడీ బేబి

Published on Feb 09,2019 03:36 PM

వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అంటూ యు ట్యూబ్ లో సంచలనం సృష్టించింది సాయి పల్లవి . మలయాళ భామ అయిన ఈ సాయి పల్లవి ఫిదా చిత్రంతో యూట్యూబ్ ప్రేక్షకులను ఫిదా చేసి పడేసింది . కట్ చేస్తే ఇప్పుడు తన రికార్డ్ ని తానే బద్దలు కొట్టింది రౌడీ బేబీ అనే పాటతో . ఈ రౌడీ బేబీ అనే పాటని ఇప్పటివరకు 18 కోట్ల మంది చూసారు . 

వీడియో సాంగ్ కి ఈ స్థాయిలో వ్యూస్ సాధించడం అంటే మాటలు కాదు ఎందుకంటే సౌత్ లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటల్లో రెండు కూడా సాయి పల్లవి పాటలు కావడం విశేషం . ఫిదా చిత్రంలోని వచ్చిండే పాట ఇప్పుడు రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది రౌడీ బేబీ పాట . ఇక రౌడీ బేబీ పాట ధనుష్ హీరోగా నటించిన మారి 2 చిత్రం లోనిది కావడం గమనార్హం .