చిత్రలహరి టీజర్ టాక్

Published on Mar 13,2019 03:43 PM

మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి టీజర్ ని ఈరోజు ఉదయం రిలీజ్ చేసారు . కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది . ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సాయి ధరమ్ తేజ్ తో పాటుగా నివేదా పేతురాజ్ , లావణ్య త్రిపాఠీ , సునీల్ లు నటించారు ఈ చిత్రంలో . 

ఇక టీజర్ విషయానికి వస్తే ప్రేక్షకులను అలరించేలా రూపొందినట్లు ఉంది చిత్రలహరి . ఒకప్పుడు చిత్రలహరి కోసం టీవీలకు అతుక్కుపోయేవాళ్లు జనాలు . కాగా ఒకప్పటిలా మా చిత్రలహరి చిత్రానికి ప్రేక్షకులు జేజేలు పలకడం ఖాయం అని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . ఇక హీరో సాయి ధరమ్ తేజ్ అయితే ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు .