అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్

Published on Mar 14,2019 04:21 PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా నటించనున్నాడు ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో . ఈ విషయాన్నీ దర్శకులు రాజమౌళి వివరించి చెప్పాడు . అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర పోరాటం చేసిన విషయం తెలిసిందే . అయితే బ్రిటిష్ వాళ్ళ పై తిరుగుబాటు చేయకముందు యుక్త వయసులో కొంతకాలం అజ్ఞాతంలో గడుపుతాడు అల్లూరి . ఆ నేపథ్యాన్ని ఎంచుకొని జక్కన్న తీస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ . 

యుక్త వయసులో అల్లూరి సీతారామరాజు అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగి ఉంటుంది అన్న ఊహాతీత కథతో ఈ సినిమా తెరకెక్కనుంది . ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ....... 400 కోట్లు . చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఎన్టీఆర్ మాత్రం కొమరం భీం పాత్రలో నటించనున్నాడు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020 లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .