ఎన్టీఆర్ అతడికి ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడో

Published on Mar 14,2019 11:03 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ ఏ దర్శకుడైనా నిర్మాత అయినా కోరుకుంటాడు . మహేష్ కోనేరు అనే నిర్మాత కూడా ఎన్టీఆర్ తో సినిమా తీసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు . మహేష్ కోనేరు ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ తో '' 118 '' అనే విభిన్న కథా చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే . 118 మంచి విజయం సాధించడంతో ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురు చేస్తున్నాడు. 

అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బిజీ గా ఉన్నాడు ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో . రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020 లో విడుదల అవుతుంది . అంటే 2020 తర్వాత కానీ తెలీదు మహేష్ కోనేరు కు ఛాన్స్ ఇస్తాడా ? లేదా ? అన్నది . అయితే ఇతగాడు మాత్రం ఎన్టీఆర్ కోసం కాచుకు కూర్చున్నాడు . ఈలోపు హరీష్ శంకర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు మహేష్ కోనేరు.