దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్

Published on Feb 11,2019 05:45 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి తో పాటుగా ఇద్దరు కొడుకులతో కలిసి దుబాయ్ వెళ్ళాడు . కుటుంబసమేతంగా వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళాడు . వారం రోజుల పాటు ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయనున్న ఎన్టీఆర్ షాపింగ్ కూడా చేయనున్నాడు . ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . 

ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కొననున్నాడు . తన ప్రతీ సినిమా కోసం ఇక్కడే షాపింగ్ చేయడం ఎన్టీఆర్ కు  అలవాటు అట . 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ చిత్రం రూపొందుతోంది . చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు రాజమౌళి . ఎన్టీఆర్ కు సెలవులు ఇవ్వడంతో దుబాయ్ వెళ్ళాడు . షాపింగ్ చేసుకొని , ఫ్యామిలీ తో ఎంజాయ్ చేసాక ఇండియాకు వచ్చి మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ లో పాల్గొననున్నాడు .